PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎదురెదురుగా రెండు మోటార్ సైకిళ్ళు ఢీ

1 min read

– ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు.
పల్లెవెలుగు,వెబ్ రుద్రవరం: మండల పరిధిలోని తిప్పారెడ్డిపల్లె ఆర్ నాగులవరం గ్రామాల మార్గమధ్యంలోని ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై గురువారం రాత్రి ఎదురెదురుగా రెండు మోటార్ సైకిళ్ళు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల వివరాల మేరకు మండల కేంద్రమైన రుద్రవరం గ్రామానికి చెందిన బోయ హుస్సేని ఆళ్లగడ్డ వైపు నుండి మోటార్ సైకిళ్ పై వస్తుండగా అదే సమయంలో ఆర్ నాగులవరం గ్రామానికి చెందిన హరికృష్ణ నాగులవరం గ్రామం వైపు నుండి మోటార్ సైకిల్ పై వెళుతుండగా రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. సమాచారం అందుకున్న ఆర్ నాగులవరం గ్రామస్తులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటా హుటిన 108 వాహనం ద్వారా ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారన్నారు. సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి సంఘటన స్థలానికి పోలీసులను పంపగా సంఘటన వివరాలు తెలుసుకుని ప్రమాదానికి గురైన మోటార్ సైకిళ్లను పోలీసులు స్టేషన్ కు తరలించారు.

About Author