NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ర‌న్ వే పై రెండు ముక్క‌లైన విమానం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ర‌న్ వే పై ఓ విమానం రెండు ముక్కలైంది. ఈ ఘ‌ట‌న జ‌ర్మ‌నీలో జ‌రిగింది. జర్మనీకి చెందిన‌ డీచ్‌ఎల్‌ బోయింగ్‌ 757 కార్గో విమానం.. కోస్టారికాలోని సాన్‌ జోస్ ఎయిర్ పోర్టు నుంచి బ‌య‌లుదేరింది. అయితే కాసేపటికే సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తిందని పైలెట్‌.. అత్య‌వ‌స‌ర‌ ల్యాండింగ్‌ కోసం ఎయిర్‌పోర్ట్‌ పర్మిషన్‌ కోరాడు. దీంతో అధికారులు అనుమ‌తి ఇచ్చారు. తీరా.. ఎయిర్‌పోర్టుకు తిరిగి వ‌చ్చిన ఆ కార్గో విమానం రన్‌వేపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత రెండు ముక్కలైంది. అందులోంచి పైలట్లు క్షేమంగా బయటపడ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో హైడ్రాలిక్‌ సమస్య తలెత్తింద‌ని, అందుకే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వివ‌రించారు. అయినప్పటికీ ఈ ఘటనపై హైలెవల్‌ దర్యాప్తున‌కు ఆదేశించిన‌ట్లు వివ‌రించారు.

                                  

About Author