NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇద్దరు విద్యార్థులు అదృశ్యం- కేసు నమోదు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఇద్దరు విద్యార్థులు అదృశ్యం అయిన సంఘటన మిడుతూరు మండలంలో చోటుచేసుకుంది.ఎస్ఐ మారుతి శంకర్ తెలిపిన వివరాల మేరకు నాగలూటి గ్రామానికి చెందిన వడ్డే వెంకటేశ్వరమ్మ,గోవర్ధన్ వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చరణ్-(14)9వ తరగతి,తేజ(12)ఏడవ తరగతి దామ గట్ల జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతు న్నారు.వీరిద్దరూ ఇంటి నుండి పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చేవారు.ఈనెల 6వ తేదీ(ఆదివారం రోజు)న కూరగాయలు సరుకులు తీసుకువస్తానని చెప్పి ఆమె నందికొట్కూరుకు వెళ్ళి మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటికి వచ్చింది.ఇంటి చుట్టుపక్కల మరియు బంధువుల దగ్గర విచారించినా ఎలాంటి ఆచూకీ లభించలేదు.5 సంవత్సరముల క్రితం భర్త గోవర్ధన్ అనారోగ్యంతో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.అదేవిధంగా పెద్ద అబ్బాయి పసుపు కలర్ షర్టు నలుపు పాయింటు,చిన్న బ్బాయి తేజ ఆరంజ్ కలర్ షర్టు,తెలుపు పాయింట్ ధరించారని శనివారం తల్లి వడ్డే వెంకటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

About Author