శాసనమండలిలో ఖాళీ అవుతున్న రెండు యాదవ స్థానాలు యాదవులకే ఇవ్వాలి
1 min read
అఖిల భారత యాదవ మహాసభ జనరల్ సెక్రెటరీ పెద్ది బోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్
విజయవాడ, న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ప్రస్తుతం ఖాళీ అవుతున్న 5 స్థానాలలో రెండు స్థానాలు (యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి గార్లు) యాదవులు ప్రాతినిధ్యం వహిస్తున్నవని, ఆ స్థానాలు తిరిగి యాదవులకే కేటాయించాలని సోమవారం అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిబోయిన శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఏలూరు రోడ్ లోని సీతారాంపురం లో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ, విజయవాడ నగర నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అత్యధిక శాతం యాదవులు మద్దతు తెలపడం ఒక ముఖ్య కారణం కాగా, ఆది నుండి బీసీ లలో అత్యదిక జనాభా కలిగిన యాదవులు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న విషయం పార్టీ నాయకత్వము గుర్తు పెట్టుకోవాలని పెద్దిబోయిన కోరారు. టిడిపి పార్టీకి తమ యాదవ సంఘీయులు అందించిన సేవలు, అందిస్తున్న కొత్త పాత యాదవ నాయకులు ఏంతో మంది శాసనమండలి స్థానం పై ఆశాభావంతో ఉన్నారన్నారు.దామాషా ప్రకారం చట్ట సభల్లో సీట్లు ఎలాగో ఇవ్వడం లేదు, ఖాళీ అవుతున్న మా స్థానాలనే పార్టీలో క్రియాశీలకంగా ఉన్న, పార్టీ విజయానికి సహకరించిన టిడిపి యాదవ నేతలకు కేటాయించాలని తమ డిమాండ్ సమంజసమని పెద్దిబోయిన పేర్కొన్నారు. అంతే కాక ప్రత్యేకంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆప్పటి శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు ఆకస్మిక మరణం తర్వాత జిల్లాలో ఇంకో యాదవునికి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉందన్నారు..కానీ అప్పుడు అలా జరగలేదన్నారు. కనీసం ఇప్పుడైనా భర్తీ చేయాలనుకుంటున్న 5 ఎమ్మెల్సీ స్థానాలలో యాదవ్ జాతి నుంచి ఉన్న టిడిపి నేతలకు ఇవ్వాలని ఆయన కోరారు. అదేవిధంగా నామినేటెడ్ పదవులను ఇచ్చి పార్టీ లో కష్టపడ్డ యాదవులకు న్యాయం చేయవలసినదిగా,యాదవులకు సముచిత స్థానం కల్పించాలని,యాదవ కార్పోరేషన్ కి వెయ్యి కోట్లు నిధులు కేటాయించాలని, రాజధాని ప్రాంతంలో “యాదవ భవన్” నిర్మాణానికి స్థలం కేటాయించాలని సంఘాలకు అతీతంగా తెలుగుదేశం అధిష్టానాన్ని ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, పార్టి రాష్ట్ర అద్యక్షులు పల్లా శ్రీనివాస రావు కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు చెవుల ఆంజనేయులు యాదవ్ పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు బట్ట సాంబశివ రావు యాదవ్, దాసరి రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.