సమగ్ర భూ సర్వేకు రెండు గ్రామాలు ఎంపిక
1 min read– బిఎల్ఓ లతో అత్యవసర సమావేశం
పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసినట్లు తహాశీల్దార్ వెంకటశివ తెలిపారు. స్థానిక తహాశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయుల ఎన్నికల నిర్వహణ కొరకు తీసుకోవాల్సిన చర్యలపై బిఎల్ఓ లతో తహాశీల్దార్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సంబంధించి గ్రాడ్యుయేట్లు ఉపాధ్యాయులు ఓటు హక్కు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని వీటికి సంబంధించి బిఎల్వోలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి సూచించామన్నారు. అలాగే మండలంలో సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు శ్రీరంగాపురం టీ లింగందిన్నె రెండు గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని వీఆర్వోలు సర్వేయర్లు భూ సర్వే ప్రక్రియలో నిమగ్నమయ్యారన్నారు. ఇప్పటికే రెండు గ్రామాలలో గ్రామసభలు నిర్వహించడం జరిగిందన్నారు. డ్రోన్ ఫ్లైట్ ద్వారా సర్వే నిర్వహించారని డ్రోన్ ల ద్వారా సర్వే ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములను సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. భూముల యజమానులకు నోటీసులు జారీ చేసి అనంతరము సర్వే ప్రక్రియ ఉంటుందని ఎంజాయ్ మెంట్ ప్రక్రియ పూర్తి చేస్తామని రైతులు అభ్యంతరాలు తెలిపినట్లైతే పరిశీలించి పారదర్శకంగా సర్వే చెప్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు బి ఎల్ ఓ లు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.