సారాయి అమ్ముతున్న ఇద్దరు అరెస్టు రిమాండ్
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చింతలపల్లె గ్రామం దగ్గర సారాయి అమ్ముతున్న నందికొట్కూరు కు చెందిన నీలి షికారి పరశురాం వద్ద నుండి 10 లీటర్ల సారాయి అదేవిధంగా కర్నూలు మండలం పసుపల గ్రామానికి చెందిన కుమార్ వద్ద నుంచి పది లీటర్ల సారాయి చింతలపల్లిలో అమ్ముతుండగా వీరి వద్ద నుంచి ప్యాషన్ ప్రో బైక్ ను స్వాధీనం చేసుకుని వీరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మిడుతూరు ఎస్సై ఎం.జగన్ మోహన్ తెలిపారు.మండలంలో ఎవరైనా సరే సారాయి,పేకాట,మద్యం అమ్మడం చేసినట్లయితే మాకు అందిన సమాచారం మేరకు కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్సై తెలిపారు.