రెండేళ్లపాలన.. దేశానికే ఆదర్శం
1 min read– వైఎస్సార్ సీపీ యువ నాయకులు పెడబల్లి ప్రదీప్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, చెన్నూరు : రా ష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సుపరిపాలన దేశానికి ఆదర్శంగా మారిందని, ఇందుకు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే సాక్ష్యాలుగా నిలిచాయని వైఎస్సార్ సీపీ యువ నాయకులు పెడబల్లి ప్రదీప్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎస్సీ కాలనీలో రెండేళ్ల సంక్షేమ పాలన సందర్భంగా మహిళలు, యువకులతో కలిసి కేక్ కట్ చేసి, పంచారు. ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న అమ్మ ఒడి, వైయస్సార్ రైతు భరోసా, మత్స్యకార భరోసా, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ బీమా, వైయస్సార్ వసతి దీవెన, వైయస్సార్ వాహన మిత్ర, మహిళలకు స్వయం సేవ సహాయ సంఘాలకు సంబంధించి, వైయస్ఆర్ సున్నా వడ్డీ, రుణ మాఫీ, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను రెండేళ్లలోనే ప్రవేశపెట్టి, పార్టీలకతీతంగా, కులాలకు అతీతంగా అర్హులందరికీ అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేనన్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చంద్ర , ప్రసాద్, శివ శంకర్, శ్యామ్, వెంకటసుబ్బయ్య, హుస్సేన్, రమేష్ , బ్రహ్మయ్య, వార్డు మెంబరు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.