కేసి కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు
1 min read– ఒకరి మృత దేహం లభ్యం.. మరొకరి కోసం గాలింపు..
పల్లె వెలుగు. నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామ సమీపంలో శుక్రవారం కేసి కాలువలో ఈతకు దిగిన మహమ్మద్ రఫీ (23), జగదీష్ (18) మృత్యువాత పడ్డారు. శనివారం మహమ్మద్ రఫీ మృత దేహం కేసి కాలువ క్రషర్ గేట్ల వద్ద లభ్యమైంది. మరో యువకుడి మృత దేహం కోసం పోలిసులు, బందువులు కేసి కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. బందువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ కు చెందిన సుబ్బారాయుడు , లక్ష్మిదేవిల కుమారుడు జగదీష్ డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. కరోనా వలన ప్రభుత్వం కాలేజ్ లకు సెలవులు ప్రకటించడంతో తాపీ పనులకు వెళ్ళేవాడు. హజీ నగర్ కు చెందిన మహబూబ్ బాషా, బిబి ల కుమారుడు మహమ్మద్ రఫీ .తాపీ పనులకు వెళ్ళేవాడు. శుక్రవారం ఇద్దరు జోగులాంబ గద్వాల జిల్లా లోని సుల్తనాపురం గ్రామంలో బందువులు నిర్వహిస్తున్న తండి కార్యక్రమానికి స్నేహితులతో కలిసి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అల్లూరు గ్రామం సమీపంలో కేసి కాలువలో ఈత కోసం దిగారు. కాలువ లో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు, స్నేహితులు కాలువలో గాలించారు. విషయం తెలుసుకున్న బ్రాహ్మణ కొట్కూరు ఎస్ఐ జయ శేఖర్ ఘటన స్థలానికి చేరుకొని కాలువలో గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకి దొరక లేదు. శనివారం ఒకరి మృత దేహం లభించడంతో పోస్టు మార్టం నిమిత్తం నందికొట్కూరు కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.