PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తోటి ప్ర‌యాణికుడి పై.. పిడిగుద్దుల వ‌ర్షం కురిపించిన టైస‌న్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ తోటి ప్రయాణికుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. విమానంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మైక్ టైసన్ బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు జెట్ బ్లూ ఎయిర్‌లైన్ విమానం ఎక్కాడు. అదే విమానంలో టైసన్ వెనక సీటులో కూర్చున్న ఓ యువకుడు పదేపదే అతడితో మాట్లాడుతూ ఇబ్బంది కలిగించాడు. పలుమార్లు ఆ యువకుడిని మాట్లాడింది చాలు.. నిశబ్దంగా కూర్చొమని సముదాయించాడు టైసన్. అయినా ఆ యువకుడు వినలేదు. వాటర్ బాటిల్ విసరడంతో పాటు ఇంకా ఎక్కువగా మాట్లాడటం చేశాడు. దాంతో చిర్రెతిపోయిన టైసన్.. ఒక్కసారిగా ఆ యువకుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. యువకుడికి తన పంచ్ పవర్ చూపించాడు. అంతే.. యువకుడి ముఖం పగిలింది. ఈ ఘటనను కొందరు ప్రయాణికులు వీడియో తీసి అంతర్జాలంలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

                                  

About Author