ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై అమెరికా డ్రోన్ దాడులు
1 min read
పల్లెవెలుగు వెబ్ : ఆప్ఘనిస్థాన్ ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై అమెరికా డ్రోన్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో కాబూల్ విమానాశ్రయం వద్ద ఉన్న అమెరికా పౌరులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని హెచ్చరించింది. ఇటీవల కాబూల్ విమానాశ్రయం వెలుపల జరిగిన బాంబు దాడిలో 100 మంది పౌరులు, 13 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా అమెరికా డ్రోన్ దాడులకు దిగింది. కాబూల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతినబూనారు. ఈ నేపథ్యంలోనే అమెరికా దళాలు దాడులకు దిగాయి.