NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉడిపి పలిమారు పిఠాధిపతి శ్రీ విద్యాదీశ స్వామి కర్నూలు కు రాక

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శనివారం 30వ తేది ఉడిపి శ్రీకృష్ణ అష్ట మఠం లలో ఒకటి అయిన పలిమారు మఠం పీఠం అధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యాదీశ తీర్థ స్వామి వారు ఉత్తరాది కారి శ్రీ విద్యా రాజేశ్వరా తీర్థ స్వామి వారు కర్నూలు నగరం వెంకట రమణ కాలనిలో ఆచార్య మేడూరి దీక్షితుల వెంకట సుబ్బయ్య గారి స్మారక వేద విద్యా భవన్ భూమి పూజ కార్యక్రమం కు విచ్చేస్తున్నారని స్థల దాతలు సాహితి సమితి అధ్యక్షులు కూరడి చంద్రశేఖర్ kalkura, గారు తెలిపారు.ఈ స్థలములో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం వారు భవనం నిర్మించి వేద పాఠశాల నిర్వహిస్తారని తెలిపారు పర్యటన లో భాగంగా స్థానిక సంకల్ బాగ్ హరిహర క్షేత్రం లో వెంకటేశ్వర స్వామి దేవాలయం లో స్వామి వారు ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు.అనంతరం 10 గంటలకు వేద విద్యా భవన్ భూమి పూజ కార్యక్రమం ఉంటుందనిఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో భక్తులు అందరు పాల్గొని స్వామి వార్ల దర్శనం చేసుకొని స్వామి వారి అనుగ్రహం పొందాలని కోరారు ఈ కార్యక్రమం లో కరివేన సత్రం కార్యవర్గ సభ్యులు హెచ్ కె మనోహర రావు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్రశేఖర్ శర్మ, కార్యదర్శి హెచ్ కె రాజశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.

About Author