NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉగాది వేడుక‌ల‌ను సంప్రదాయ‌భ‌ద్దంగా నిర్వహించాలి

1 min read

జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ అధికారులకు ఆదేశాలు

పశ్చిమగోదావరి జిల్లాప్రతినిధి  న్యూస్​ నేడు :ఉగాది వేడుక‌లను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాటు చేయాలని వాటి నిర్వహ‌ణ‌పై త‌మ ఛాంబ‌ర్‌ నందు వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ కోటి రాహుల్ కుమార్ అధికారులను ఆదేశించారు.రాష్ట్రప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా ఈనెల 30వ తేదీన ఉగాది వేడుక‌ల‌ను  నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. తెలుగువారి సంప్రదాయం ఉట్టిప‌డే విధంగా మామిడాకుల తోర‌ణాలు, అర‌టి చెట్లతో అలంక‌ర‌ణ‌లు చేయాల‌ని సూచించారు. ఉగాది పంచాంగ శ్రవ‌ణం, వేదాశీర్వచ‌నం, ఉగాది ప‌చ్చడి, ప్రసాదాల ఏర్పాటు,  వేదిక అలంక‌ర‌ణ బాధ్యత‌ల‌ను, వేదిక‌పై బ్యాక్ డ్రాప్ ఏర్పాటును  దేవాదాయ‌శాఖ నిర్వహించాల‌ని ఆదేశించారు.  సౌండ్ సిస్టమ్, లైవ్ స్ట్రీమింగ్  ఏర్పాటును స‌మాచార పౌర సంబంధాల శాఖ‌ను పర్యవేక్షించాలని సూచించారు.అతిధుల‌కు ఆహ్వానం, ఇత‌ర ప్రోటోకాల్ బాధ్యత‌ల‌ను ఆర్‌డిఓకు పర్యవేక్షించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహ‌ణ‌ను డి ఈ ఓ కు అప్పగించారు.  విధుల‌ను అన్ని శాఖ‌లు స‌మ‌ర్థవంతంగా నిర్వహించి, వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని జాయింట్ కలెక్టర్ కోరారు.ఈ స‌మీక్షా స‌మావేశంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ టి.వి.సుబ్బారావు, డి పి ఆర్ టి.నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు,  సిపిఓ కె.శ్రీనివాసరావు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి   డా.ఎం.మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్ర రెడ్డి, తహాసిల్దార్ రావి రాంబాబు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author