‘ఉగాది’ సాంస్కృతిక మహోత్సవం ప్రారంభం…
1 min readపల్లెవెలుగు వెబ్: శ్రీశైలమహాక్షేత్రంలో ఉగాది సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు దేవస్థానం వారు నిర్వహించారు ఉగాది మహోత్సవాలలో భాగంగా ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన పలు కన్నడ. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. శ్రీశైల దేవస్థానం మరియు శ్రీశైల జగద్గురు సేవా సమితి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యములో నేటి నుంచి ఏప్రియల్ 2 వతేదీ వరకు ఈ ధార్మిక మరియు సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీ దేవస్థానం ఈఓఎస్. లవన్న జ్యోతి ప్రజ్వలనతో ఈ ధార్మిక మరియు సాంస్కృతిక మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క మాట్లాడుతూ కన్నడ ప్రజల భ్రమరాంబాదేవివారిని ఆడపరుచుగా, మల్లికార్జునస్వామివారిని తమ అల్లునిగా భావిస్తారన్నారు. అంతేకాకుండా పలుప్రాంతాలలోని కన్నడ ప్రజలకు మల్లికార్జునస్వామివారే ఇలవేల్పు అని పేర్కొన్నారు. అందుకే కన్నడ భక్తులు ఉగాది ఉత్సవాలలో ప్రత్యేకంగా ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీశైల యాత్రను చేయడం జరుగుతుందన్నారు. సందర్భంగా భక్తులందరికీ శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దివ్యాశ్సీసులు లభించాలని శ్రీశ్రీశ్రీ డా. చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు ఆకాంక్షించారు.