NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తీపి చేదుల సమ్మేళనమే ఉగాది-జమీల్‌ అహ్మద్‌ బేగ్‌

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: తీపి, చేదు కలగలిసిందే జీవితం.. కష్టం, సుఖం తెలిసిందే జీవితం.. ఆ జీవితంలో ఆనందోత్సాహాలు పూయించేందుకు వచ్చింది ఉగాది పర్వదినం. ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసే పండుగ ఉగాది. గుండెల్లో ఆనంద క్షణాలు నింపే సంప్రదాయం మనది. కష్ట సుఖాలు జీవితంలో చవిచూడాలి మాధుర్యం షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనం తెలియజెప్పే నిజం. జీవితం సకల అనుభూతుల సమ్మిళితం స్థితప్రజ్ఞత అలవర్చుకోవడం వివేకి లక్షణం.. అదే ఉగాది తెలిపే సందేశం అని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రజలందరూ రాబోవు శోభకృతునామ సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

About Author