PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉగాది మహోత్సవాలు 6 నుండి ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్​ శ్రీశైలం:  శ్రీశైల క్షేత్రంలో ఈనెల ఆరు నుండి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయిదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు 10వ తేదీతో ముగియనున్నాయి. జ్యోతిర్లింగస్వరూపుడైన మల్లికార్జునస్వామివారికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి అయిన శ్రీభ్రమరాంబాదేవి వారికి ప్రత్యేక పూజలు, శ్రీస్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు, అమ్మవారికి అలంకరణలు, 8 తేదీన ప్రభోత్సవం, వీరాచార విన్యాసాలు, ఉగాదిరోజైన 9వ తేదీన ఉదయం పంచాంగశ్రవణం, పండిత సత్కారం, సాయంకాలం రథోత్సవం జరుగనున్నాయి.ఆరవ తేదీ బృంగి వాహనంఅమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తారుఏడవ తారీఖు కైలాస వాహనం మహా దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారుఎనిమిదవ తారీకు గం. 5.30 నిమిషాలకు. ప్రభోత్సవం రాత్రి గం. 7.00 లకుకైలాసవాహనసేవ మహా సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారురాత్రి గం. 10.00 లకు వీరాచార విన్యాసాలు అగ్నిగుండ ప్రవేశంఉగాది పర్వదినంరోజున ఉదయం 10 గంటలకు పంచాంగ శ్రవణం రాజేశ్వరి దేవి అలంకారం భక్తులకు దర్శనమిస్తారు. పదవ తేదీ ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి రాత్రి 7 గంటలకు స్వామి అమ్మవార్ల అస్వ వాహన సేవ భ్రమరాంబ దేవి నిజరూప అలంకారలో భక్తులకు దర్శనమిస్తారు. ఆరవ తేదీ ఉదయం ఉదయం యాగశాల ప్రవేశం తరువాత శివశంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ, కంకణపూజ, ఋత్విగ్వరణం, దీక్షా కంకణధారణ, అఖండదీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, రుద్రకలశస్థాపన, పంచావరణార్చన, కలశార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు జరిపించబడుతాయి.సాయంత్రం 5.30 గంటలకు సాయంకాలార్చనలు, చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చనలు, అంకురార్పణ. అగ్నిప్రతిష్ఠాపన, నిత్యహవనములు, రుద్రహోమము, జరిపించబడుతాయి.ఉత్సవాలలో ఏప్రియల్ 7వ తేదీ నుంచి ప్రతీరోజు యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధన, పంచావరణార్చనలు, కలశర్చనలు, జపానుష్ఠానాలు, రుద్రహోమం, చండీహోమం, శ్రీభ్రమరాంబాదేవి ఆలయంలో నవావరణార్చనలు, కుంకుమార్చనలు జరిపించబడుతాయి. అదేవిధంగా ప్రతీరోజు రాత్రి 8.00 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం అనంతరం ఏకాంతసేవ నిర్వహించబడుతాయి.

About Author