30న కళ్లే వేణుగోపాల్ శర్మ.. ఉగాది పంచాంగ శ్రవణం
1 min read
కర్నూలు: విశ్వావసు తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా నగరంలోని హరి హర క్షేత్రం సంకల్ బాగ్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయము ఆవరణలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు బ్రహ్మశ్రీ కళ్ళే వేణుగోపాల్ శర్మ గారి పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసినట్లు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సండేల్ చంద్ర శేఖర్ తెలిపారు. . దేవాలయ ఆవరణలో కమిటీ సభ్యులు మంగళవారం సమావేశం నిర్వహించారు. పండగ పర్వదినం సందర్భంగా భక్తులకు వసతులు తదితర అంశాలపై చర్చించారు. ఉగాది పంచాంగ శ్రవణం విని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి.. స్వామి కృపకు పాత్రులు కాగలరని కమిటీ అధ్యక్షుడు సండేల్ చంద్ర శేఖర్ , కమిటీ సభ్యులు భక్తులను కోరారు.