ఉగాది, రంజాన్, పండుగల డిస్కౌంట్ లు
1 min read
ఆప్కో విక్రయశాలలపై 45% డిస్కౌంట్లు
సందర్శించి వెంకటగిరి,చీరాల, మాధవరం,దుప్పట్లు, దోవంతులు కొనుగోలు చేసి ఆదరించాలి
వాణిజ్య అధికారి బి.హరి ప్రసాద్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: ఉగాది మరియు రంజాన్ పండుగలను పురస్కరించుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం సరి కొత్త వస్త్రాలపై ౩౦% డిస్కౌంట్ మరియు ఎంపిక చేసిన చేనేత వస్త్రాలపై 45% డిస్కౌంట్ ను ఇస్తున్నట్లు ఆప్కో రాజమండ్రి మండల వాణిజ్య అధికారి బి. హరిప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా లోని సి.ఆర్ రెడ్డి షో రూమ్, నేత బజార్ భవనం,సి.ఆర్ రెడ్డి కళాశాల ఎదురుగా గల ఆప్కో విక్రయ శాలలలో పై ఆఫర్ లు అందించనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలందరూ ఆప్కో విక్రయ శాలలు సందర్శించి తమకు కావలసిన రాజమండ్రి,బందరు,వెంకటగిరి, మాధవరం,చీరాల,ఉప్పాడ చీరలు,షర్టింగ్ ,దోవతులు, దుప్పట్లు,లుంగీలు,టవల్స్ మొదలగు చేనేత వస్త్రాలు కొనుగోలుచేసి చేనేత వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించి చేనేత కార్మికులను ఆదరించాలని కోరారు.
