PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డా. కృష్ణమాచార్యకు..ఉగాది శుభాకాంక్షలు

1 min read
డా. కృష్ణమాచార్యకు జ్ఞాపికను అందజేస్తున్న జర్నలిస్టులు

డా. కృష్ణమాచార్యకు జ్ఞాపికను అందజేస్తున్న జర్నలిస్టులు

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: ప్రసిద్ధ జ్యోతిష్యుడు డాక్టర్​ కృష్ణమాచార్యకు ఉగాది శభాకాంక్షలు తెలిపారు ఆయన అభిమానులు, జర్నలిస్టులు. అనంతరం స్వామి వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా డా. కృష్ణమాచార్య మాట్లాడుతూ ప్లవనామ ఉగాది నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసేందుకు ఎల్లప్పుడు ముందుంటానన్న డా. కృష్ణమాచార్య… ఈఏడాది మరింత సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశరు. ఆయనను కలిసిన వారిలో రాష్ట్రీయ బ్రహ్మ సేన రాష్ట్ర అధ్యక్షులు, పల్లె వెలుగు చెన్నూరు విలేకరి వెంకట శివప్రసాద్​, ఓబులేష్​, జయరాం, రాజేంద్ర ప్రసాద్​ తదితరులు పాల్గొన్నారు.

About Author