పిల్లలను ఉత్పత్తి చేసే కర్మాగారంగా ఉక్రెయిన్ !
1 min readపల్లెవెలుగు వెబ్: పిల్లలను ఉత్పత్తి చేసే కర్మాగారంగా.. యూరప్ లోని రెండో అతిపెద్ద దేశమైన ఉక్రెయిన్ మారింది. అద్దె గర్భం, సంతాన సౌఫల్య వ్యాపారాన్ని అక్కడ చట్టబద్ధం చేయడంతో.. విదేశీ దంపతులు ఉక్రెయిన్ కు క్యూ కడుతున్నారు. పిల్లలు లేని విదేశీయులు అండం, వీర్యం, ఫలదీకరణం చెందిన అండం ద్వార పిల్లలను పొందుతున్నారు. ప్రతి సంవత్సరం విదేశీయుల కోసం 3వేల మంది పిల్లల్ని కంటున్నారు. 2000 సంవత్సరం నుంచి సరోగసి విధానం ఉక్రెయిన్ లో అమలులో ఉంది. వాణిజ్యపరంగ ఉక్రెయిన్ లో ఇది పుంజుకుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో అద్దె గర్భం కోసం వచ్చే వారిలో మూడో వంతు చైనా దేశీయులే ఉన్నారు.