ఉక్రెయిన్ అధ్యక్షుడి `రాజీ` ఫార్ములా.. యుద్ధం ముగిసేనా ?
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. వేలాది మంది సైనికులు, పౌరులు ఈ దాడులో మృతిచెందారు. రష్యా ధాటికి ఉక్రెయిన్ చిగురుటాకులా వణుకుతోంది. కొండంత ఆశతో మద్దతు కోసం నాటో వైపు చూసినా.. మద్దతు రాలేదు. అంతర్జాతీయ సమాజమూ రష్యాను ఆపలేకపోయింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రాజీకి సిద్ధమయ్యారు. నాటోలో చేరబోమని ప్రకటించారు. తాను చల్లబడిపోయానని వ్యాఖ్యానించారు. యుద్ధానికి కారణమైన ‘నాటో’లో చేరే ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. రష్యా చేసిన మరో కీలక డిమాండ్‌పైనా ‘రాజీ’కి సిద్ధమని స్పష్టం చేశారు. ఏబీసీ ఇంటర్వ్యూలో నాటోపై జెలెన్‌స్కీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డా రు. సోవియట్ నుంచి విడిపోయిన దేశాల మధ్య నాటో చిచ్చు పెట్టిందని విమర్శించారు. ఉత్తర అట్లాంటిక్ సమాఖ్య పేరుతో ఏర్పడ్డ నాటో తూర్పున కూ చొచ్చుకుపోయిందని.. ఐరోపాకు, రష్యాకు మధ్య కోల్డ్‌వార్‌కి దారి తీసిందని దుయ్యబట్టారు. ‘‘నాటోలో చేరతామని ఎన్నో ఏళ్లుగా ప్రాధేయపడ్డాం. ఇప్పుడు చెబుతున్నా..! మేము అసలు నాటోలో చేరేదే లేదు’’ అని వ్యాఖ్యానించారు.