సూర్యుడి తాపానికి తట్టుకోలేక ఎల్లెల్సీలో ఈతలు
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: గత కొద్ది రోజుల నుంచి పెరిగిన ఉష్ణోగ్రత తీవ్రతతో జనం ఉదయం 11 గం టలు దాటితే ఇంటి నుంచి బయటకు రావ డానికి జంకుతున్నారు. ఎండకాలం మొదలు కావడంతో సూర్యూడి తాపానికి ప్రజలు అల్లా డుతున్నారు. గడిచిన రెండు రోజులగా మండ లంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతం నమోదవుతోంది. దీంతో మధ్యాహ్నం బస్టాండులు, వీధులునిర్మానుషంగా మారుతున్నాయి. గంటల తర బడి ఫ్యానుల కింద కాలం గడుపుతున్నారు. యువకులు, చిన్నారులు బావిలు, కాలువలకు చేరుకుని వెసవి తాపాన్ని తీర్చుకుంటున్నారు. హొళగుందతో పాటు తుంగభద్ర దిగువ కాలు వ(ఎల్లెల్సీ) పరిసర గ్రామాల్లో యువకులు, చిన్నారులు. పెద్దలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈత కొడుతూ ఆనందంగా గడుపుతున్నారు. కాగా ఎల్లెల్సీకి ఈ నెలాఖరు లేదా ఏప్రిల్ 15న నీటి సరఫరాను నిలిపి వేయనున్నారు.
