NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ: జిల్లా ఎమ్ఐనైజేషన్ ఆఫీసర్ డా. ప్రవీణ్ కుమార్

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల లోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ని జిల్లా ఇమ్మానైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో ఇమ్మానైజేషన్, ప్రసవాలు గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రంగ రవళి ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కూల్డ్ చైన్ సిస్టం ఫ్రిడ్జ్ ని అందులోని మందులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇమ్మానైజేషన్ 100% పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు ఎవరు కూడా ఉదయం 10 గంటలు దాటిన తర్వాత సాయంత్రం ఐదు గంటల వరకు బయటకు రాకుండా ఉండి వడదెబ్బ తలగకుండా తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author