అనుమతిలేని…బాణసంచా షాపులను తరలించాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ నంద్యాల: నంద్యాల మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అనుమతి లేకుండానే ఇష్టం వచ్చిన రీతిలో కళశాల బిల్డింగ్ కు అనుకోని బాణాసంచా స్టాల్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులు. నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ గారికి వినతిపత్రం అందజేసిన బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి, యువజన సంఘం స్థానిక నంద్యాల పట్టణ ప్రభుత్వ డిగ్రీ కలశాలలో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటుచేసినా బాణసంచా స్టాల్ లను ఎత్తివేయాలని కోరుతూ నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బీసీ,,ఎస్సి,ఎస్టి మైనారిటీ విద్యార్థి యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్. రియాజ్ మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కలశాల నందు ఎటువంటి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా కలశాల బిల్డింగ్ కు అనుకొని బాణసంచా స్టాల్లు ఏర్పాటు చేసారని ఇలా ఏర్పాటు చేయడం ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే కలశాల బిల్డింగ్ లో ఉన్న లైబ్రరీ లో బుక్కులు కాలిపోయే అవకాశం ఉందని అదే విధంగా విద్యార్థులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని,స్టాల్ లలో జరిగే వ్యాపారం వల్ల విద్యార్థుల చదువు కూడా నష్ట పోయే అవకాశం ఉందని వెంటనే అధికారులు వెంటనే స్పందించి కలశాల పక్కన ఏర్పాటు చేసిన బాణసంచా స్టాల్ లను ఎత్తివేసి దూరంగా పెట్టాలని ఆయన డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో రాజు,సోము తదితరులు పాల్గొన్నారు.