లోకాయుక్త ఆదేశాలతో అనధికార లేఔట్ తొలగింపు
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: కృష్ణాజిల్లా పమిడి ముక్కల మండలం గురజాడ గ్రామంలోని సర్వే నెంబర్లు 150/1 , 150 /2 ,150/3, 150/4 ,150/5 ,150/6 ల లోని య 5-58 సెంట్లు ఏ.పీ. సి. ఆర్ .డి .ఏ జోనల్ డిప్యూటీ డైరెక్టర్ కే .దివ్యలత ఆధ్వర్యంలో అధికారులు తొలగించారు.గురజాడ గ్రామంలోని పై సర్వే నెంబర్ లోని అనధికార లేఔట్ పై 2021 నవంబర్ 11వ తేదీన రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ రెడ్డి కిగురజాడ మాజీ సర్పంచ్ జంపాన శ్రీనివాస్ గౌడ్ చేసిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త విజయవాడ ఏ.పీ. సి ఆర్. డి .ఏ కమిషనర్ ను నివేదిక కోరడం జరిగింది. ఏపీ సి ఆర్ డి ఏ అధికారులు విచారణ నివేదికను లోకాయుక్త సమర్పించకపోవడంతో ఏ.పీ .సి. ఆర్. డి. ఏ కమిషనర్ వివేక్ యాదవ్ కు లోకాయుక్త సమన్లు జారీ చేయడం జరిగింది .ఏ.పీ. సి .ఆర్. డి .ఏ జోనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు గురజాడ గ్రామంలో అనధికార లేఔట్ లోని రహదారులను తొలగించడం జరిగింది.ఈ మేరకు ఏ.పీ. సి .ఆర్. డి. ఏ కమిషనర్ వివేక్ యాదవ్ జోనల్ డిప్యూటీ డైరెక్టర్ కె. దివ్య లత లోకయుక్తకు నివేదికలు సమర్పించడం జరిగింది. అనధికార లేఔట్ యజమానికి ఏ.పీ. సి. ఆర్ .డి .ఏ సెక్షన్లు 108, 114, 115, 116 ప్రకారం నోటీస్ జారీ చేయడం జరిగింది అని గురజాడ మాజీ సర్పంచ్ గౌడ్ ప్రకటనలో తెలియజేశారు.