PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మహానంది’ నూతన పాలకమండలి పై వీడని సందిగ్ధత..!

1 min read

పల్లెవెలుగువెబ్​, మహానంది : మహానంది దేవస్థానం నూతన పాలకమండలిపై నేటికీ వీడని సందిగ్ధత వీడలేదు. కోర్టు వివాదాలే ఇందుకు కారణమని చెబుతున్నారు. అధికారులు కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపితే.. కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడితో కిందిస్థాయి లో కొందరు తమ పదవుల కోసం అధికారులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. కొన్ని నెలల క్రితం నుంచి మహానంది దేవస్థానం నూతన పాలక మండలి ఏర్పాట్లపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆచరించడానికి పోయేసరికి కోర్టు వివాదాలు అడ్డు వస్తున్నట్లు సమాచారం. అన్ని తెలిసినా…పదవుల కోసం కొందరు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వనీయ సమాచారం.

About Author