మహానంది మండలంలో విచ్చలవిడిగా మద్యం లూజు విక్రయాలు
1 min read
మహానంది, న్యూస్ నేడు: మహానంది మండలంలోని వైన్ షాపుల్లో మద్యం లూజు విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం. బార్లలో మాత్రమే లూజు విక్రయాలకు అవకాశం ఉంది. దీంతోపాటు మండలంలోని అన్ని వైన్ షాపుల వద్ద అనుమతులు లేకుండా మద్యం సేవించడానికి అని ఏర్పాట్లు మద్యం షాపు యజమానులు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎక్సైజ్ శాఖ చూసి చూడనట్టు వ్యవహరించడంతో వైన్ షాపులు బార్లను తలపిస్తున్నట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖ నిఘా కొరవడంతో వైన్ షాపుల యజమానులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తుంది. వైన్ షాపుల్లో లూజు విక్రయాలు కొనసాగించవచ్చా, లేదా అనేది ఎక్సైజ్ శాఖ నిర్ణయించాల్సి ఉంది.
