విచ్చలవిడిగా… అడ్డు అదుపు లేకుండా తరలింపు..!
1 min read
మహానంది, న్యూస్ నేడు: విచ్చలవిడిగా అడ్డూ, అదుపు లేకుండా ఇసుక బహిరంగంగానే తరలించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బండి ఆత్మకూరు మండలం లోని సంత జూటూరు, బండి ఆత్మకూరు గ్రామాల వెంట ఉన్న కుందూ మరియు ఏటివెంట ఉన్న ఇసుకను ఇసుకాసురులు యదేచ్చగా ప్రోక్లైన్ ఉపయోగించి ట్రాక్టర్ల ద్వారా తరలించడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నట్లు తెలుస్తుంది. ఒక్కొక్క ట్రాక్టర్ కు ఒక రేటు నిర్ణయించి బయట మార్కెట్లో విక్రయించి జేబులు నింపుకుంటున్నట్లు తెలుస్తుంది. సినిమాల్లో చూపించిన విధంగా తమ సత్తా చూపిస్తూ అక్రమ దందాకు తెర లేపినట్లు సమాచారం. అధికారికంగా అనుమతులు ఉన్నాయా లేదా అనేది తేలాల్సి ఉంది. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ప్రకృతి వనరులు ప్రైవేటు వ్యక్తులకు ఆదాయ వనరు లుగా మారాయని ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి అధికారుల కళ్లకు గంతలు కట్టి అక్రమార్కులు ఏదేక్షగా బహిరంగంగానే అక్రమంగా ప్రకృతి వనరులను తరలిస్తూ తమ జేబులు నింపుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇంతకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోనికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.