NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు జిల్లాలో అండర్-15 చెస్ ఫెస్టివల్..

1 min read

ఐక్యూ పెంచే చదరంగాన్ని మరింత ముందుకు తీసుకు వెళతాం..

అధ్యక్షులు ఉమా కిరణ్ కుమార్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక నరసింహరావు పేటలో ని లైన్స్ క్లబ్ ఆఫ్ హేలాపురి , ఎలైట్, చెస్ అసోసియేషన్ ఆఫ్  హేలాపురి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా అండర్ 15- చెస్ ఫెస్టివల్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిలుగా ప్రెసిడెంట్ LN ఎం ఉమా కిరణ్ కుమార్, ట్రెజరర్ LN ఎడివిఎన్ డూండీ కృష్ణ విజేతలుగా నిలిచిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవం చేయటం జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ఎంతో ఐక్యూ పెంపొందించే చదరంగాన్ని మరింత ముందుకు తీసుకు వెళతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో LN శ్రీహరి(DC), LN ఎం కృష్ణమోహన్(DC),LN సిహెచ్ శ్రీనివాసరావు (DC),LN భాస్కరరామమ్ (DC), అసోసియేట్ ప్రెసిడెంట్ జి యోహానన్, సెక్రటరీ జి హదస్స అరుణ తదితరులు పాల్గొన్నారు. విజేతలు సిహెచ్ వివేక్ (ప్రధమ) జి అభిషేక్ అవ్రహమ్ (ద్వితీయ) జి అనురూఫ్ మోషే (తృతీయ) టి తన్మయి సాయి నాలుగవ స్థానం, ఎన్ నిత్యశ్రీ ఐదవ స్థానం సాధించారు. వీరిని పలువురు కరచరాల ధ్వనులతో అభినందించారు.

About Author