సీపీఎం ఆధ్వర్యంలో.. లఖింపూర్ ఉద్యమకారులకు నివాళి
1 min readపల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు : ఉత్తరప్రదేశ్ లఖింపూర్ రైతు ఉద్యమకారులకు ఘననివాళి అర్పించారు సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ నాయకులు. ఆదివారం సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొణిదెల ,నాగటూరు, మల్యాల, బిజినవేముల గ్రామాల్లో రైతు అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయకార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరావు ,సిఐటియు జిల్లా నాయకులు కె భాస్కర్ రెడ్డి ,రైతు సంఘం జిల్లా నాయకులు బి రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు పి పకీర్ సాహెబ్ ,ఐద్వా నాయకురాలు బి రజిత, కొణిదెల సి ఐ టి యునాయకులు మద్దిలేటి ,ఆంజనేయులు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ కేరిలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆసీస్ మిశ్రా తన కారును రైతులపై దూసుకెళ్లి.. నలుగురి రైతుల మృతికి కారణమయ్యాడని, ఈ ఘటనపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు, కరెంటు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పది నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో 500 రైతు సంఘాలు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ రైతాంగం పైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు.
పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం వ్యవసాయ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం జరుగుతుందన్నారు, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పైన పెట్రోల్, డీజిల్ ,వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెంచడం ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేయడం జరుగుతుందన్నారు, మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ ఐక్యం కావాలని వారు కోరారు. కార్యక్రమంలో మల్యాల రైతులు సుంకన్న, శంకర్ ,వెంకటేశ్వర్లు ,శేఖర్ భాష కొణిదెల గ్రామస్తులు వెంకటేశ్వర్లు, మూర్తి, స్వాములు ,మధుసూదన్ రెడ్డి ,శేఖర్ గ్రామస్తులు రామకృష్ణ, శ్రీనివాసులు బిజినవేముల గ్రామ రైతులు ఉస్మాన్ భాష, సుదర్శనం, శివన్న గౌడ్, మౌలాలి పాల్గొన్నారు.