PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విహెచ్​పీ  ఆధ్వర్యంలో…పల్లె పల్లెలో,వాడవాడలా జనసంపర్క అభియాన్

1 min read

– రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆదివారము,ఉ: 10:30 గం.లకు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన జిల్లా సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ….విశ్వ హిందూ పరిషత్ షష్ట్యబ్ది(1964 – 1924) ఉత్సవాలలో భాగంగా గత  సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 14 వరకు దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో “శౌర్య జాగరణ  యాత్ర ” ను కర్నూలు నగరం లోని 4 పట్టణపోలీసు స్టేషన్ పరిధి లోనూ , రూరల్ మరియూ తాలూకా పరిధిలోనూ రథయాత్ర సాగిందనీ అలాగే కర్నూలు డివిజన్ లోని కర్నూలు,కల్లూరు,ఓర్వకల్లు, వెల్దుర్తి,క్రిష్ణగిరి, కోడుమూరు,గోనెగండ్ల,బెళగల్,గూడూరు మండలాల్లోనూ పర్యటించి సుమారు  పదివేల మంది హిందూబంధువులు కలిసి సనాతన ధర్మం ఆచరణ,అవశ్యకత గురించి, గత 59 సం.లుగా విశ్వ హిందూ పరిషత్ సాధించిన విషయాలగురించి, సమాజంలో హిందువులపై జరుగుతున్న అత్యాచారాల గురించి,అందువల్ల జరగాల్సిన హిందూ సంఘటన గురించి విపులంగా హిందూ సమాజానికి తెలియజేశామన్నారు , జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ అయోధ్యలో జరుగుతున్న భవ్య రామమందిర నిర్మాణం, జనవరిలో జరిగే “మహాప్రతిష్టా” కార్యక్రమం కోసం మళ్ళీ అశేష హిందూ సమాజాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా కలిసే కార్యక్రమమే ఈ ” జనసంపర్క అభియాన్ ” అని ఈ అభియాన్ ద్వారా చివరి యూనిట్ అయిన గ్రామం వరకు చేరుకుంటామని తెలియజేశారు.నగర అధ్యక్షులు టీ.సీ.మద్దిలేటి మాట్లాడుతూ రాబోయే జనసంపర్క అభియాన్ లో నగరం,మరియూ జిల్లా కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని ఈ జన సంపర్కం అభియాన్ కార్యక్రమనిర్వహణలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాను మొదటిస్థానంలో నిలబెట్టాలని అందుకోసం కార్యకర్తలందరూ సమయమిచ్చి , శ్రమించి ఈ ధర్మకార్యంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ క్షేత్రవిధి – నిధి ప్రముఖ్ సూర్యప్రకాష్  హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, సహకార్యదర్శులు గోవిందరాజులు , శివప్రసాద్ , కౌషాధికారి ఏ శ్రీనివాసరెడ్డి,బజరంగ్ దళ్ కన్వీనర్ రాజేష్ ,శివశంకర్,మహేష్ ,  నగర కార్యదర్శి ఈపూరి నాగరాజు,ప్రఖంఢ కార్యకర్తలు గిరిబాబు,సంజీవయ్య,కిరణ్ నటరాజ్, ఆనంద్, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

About Author