NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వీహెచ్​పీ ఆధ్వర్యంలో.. జిహాదీల దిష్టిబొమ్మ దగ్ధం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: జమ్ముకాశ్మీర్​లో హిందువులపై జిహాదీ మతోన్మాదులు చేస్తున్న మారణకాండను నిరసిస్తూ… శనివారం కర్నూలు కలెక్టరేట్​ ముందున్న గాంధీ విగ్రహం వద్ద జిహాదీల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు వీహెచ్​పీ, భజరంగ్​ దళ్​ నాయకులు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్​ రాష్ట్ర కార్య అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్లో ఒక పథకం ప్రకారం జిహాదీ మతోన్మాదులు హిందువులను మాత్రమే నిర్దాక్షిణ్యంగా చంపుతుండటాన్ని పిరికిపంద చర్య అని, దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. అనంతరం విశ్వహిందూపరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి ప్రాణేష్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత పాకిస్తాన్​ ఐఏఎస్​ తీవ్రవాదులు తోకముడుచుకుని ఉన్నారన్నారు. ప్రస్తుతం చాటుగా హిందువులపై హత్యాకాండకు దిగుతున్నారని, దీన్ని భారత సైన్యం ఉక్కుపాదంతో అణిచి వేస్తుందని హెచ్చరించారు. బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ అమాయక హిందువుల జోలికి వస్తే… ఊరుకోబోమని, అవసరమైతే భజరంగ్​ దళ్​ సైన్యం జిహాదీలతో ముఖాముఖి పోరాడటానికి సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్ కర్నూలు నగర కార్యాధ్యక్షులు గోరంట్ల రమణ,విభాగ్ బజరంగ్దళ్ కన్వీనర్ నీలి నరసింహ, జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్ రామకృష్ణ, జిల్లా విద్యార్థి కన్వీనర్ సాంబశివా రెడ్డి,నగర భజరంగ్దళ్ కన్వీనర్ ప్రసన్న కుమార్ రెడ్డి,గోరక్షా కన్వీనర్ రఘురాం రెడ్డి,సాప్తాహిక్ మిలన్ కన్వీనర్ సాయిరామ్,ప్రఖంఢ బజరంగ్దళ్ కార్యకర్తలు భగీరథ,నవీన్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

About Author