జనసేన ఆధ్వర్యంలో.. రోడ్ల దుస్థితిపై నిరసన
1 min readపల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు రాష్ట్రంలోని జనసైనికులు అందరూ పట్టణాలు, మండలాల గ్రామాలలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం కింద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నందికొట్కూరు జనసేన సైనికులు ముని పాటి శ్రీనివాస్ గౌడ్, నల్లమల్ల రవికుమార్ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణం లోని ఆర్టీసీ బస్టాండ్ నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్లు , మురికి కాలువల దుస్థితి పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన సైనికులు మాట్లాడుతూ రోడ్ల అధ్వాన్నంగా ఉన్నా ఈ బాధ్యత లేని ప్రభుత్వం కేవలం అప్పులు తేవడం , పన్నులు వేయడం, ఫైన్ లు వేయడం వంటి పనులు చేయడం తప్ప రోడ్లు అభివృద్ధి పై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా రోడ్లు కూడా వేయండి సీఎం సార్ అంటూ వారు నినాదాలు చేశారు. ప్రధాన వీధుల్లో ఎక్కువగ రోడ్లపై వర్షం నీళ్లు ఆగి ఉండడంతో చూడటానికి ఈత కొలను ఉన్నట్లు కనిపిస్తుందని ఈ విధమైన పాలనలో ప్రజలు ఇబ్బందులకు గురవుతారని, ప్రధానమైన రహదారులన్నీ పాడవడం వల్ల ప్రజల రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. గ్రామ పట్టణాల అభివృద్ధి కోసం బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పు రూపంలో దోచుకుండున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ద్రష్టి కి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకొనిపోవడానికి గుడ్ మార్నిగ్ సీఎం సార్ అనే కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టారని జనసేన నాయకులు తెలిపారు.