వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీపధకం కింద రూ. 61.39 కోట్లు జమ..
1 min read– సున్నా వడ్డీ పధకం సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్ధిక పురోగతి సాధించాలి..
– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పొదుపు సంఘాలకు ఆర్ధిక పురోగతికి సున్నావడ్డీ పధకం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. శుక్రవారం 2022-23 సంవత్సరానికి నాలుగో విడతగా రాష్ట్రంలో 1,05,13,305 మందికి వై.ఎస్.ఆర్. సున్నావడ్డీని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి బి.ఆర్. అంభేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట్రస్ధాయిలో నాలుగోవిడత వై.ఎస్.ఆర్. సున్నావడ్డీ పధకం కింద రూ. 1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ మెంట్ చేస్తూ పొదుపు సంఘాలకు అర్ధిక సహాయాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్బంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళా సంఘాల లబ్దిదారులతో వీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ 2022-23 నాలుగో విడత కింద ఏలూరు జిల్లాలో 45178 పొదుపు సంఘాలు 467062 మంది సభ్యులకు రూ. 61.39 కోట్లు నేరుగా బ్యాంకుల ద్వారా సంఘ అప్పు ఖాతాలకు చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇందులో చింతలపూడి నియోజకవర్గంలో 8930 సంఘాలకు, 91035 మంది సభ్యులకు రూ. 1311.54 లక్షలు, దెందులూరు నియోజకవర్గంలో 6408 సంఘాలకు, 66219 మంది సభ్యులకు రూ. 849.58 లక్షలు, ఏలూరు టౌన్ లో 4530 సంఘాలకు గాను 46613 మంది సభ్యులకు రూ. 702.17 లక్షలు, ద్వారకా తిరుమల 1799 సంఘాలకు, 18544 మంది సభ్యులకు రూ. 266.62 లక్షలు, కైకలూరు 5680 సంఘాలకు 59426 మంది సభ్యులకు 722.31 లక్షలు, నూజివీడు 6400 సంఘాలకు 67845 మంది సభ్యులకు రూ. 828.56 లక్షలు, పోలవరం 5766 సంఘాలకు 58776 మంది సభ్యులకు 660.70 లక్షలు, ఉంగుటూరు 5665 సంఘాలకు 58604 మంది సభ్యులకు రూ. 797.32 లక్షలు, అప్పుఖాతాలకు చెల్లించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారిత మరింత మెరుగుపడి స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళలయొక్క ఆర్ధిక పురోగతికి ఈ పధకం దోహదపడుతుందని చెప్పారు. మహిళా సంఘ సభ్యులకు రూ. 61.39 కోట్లు జిల్లా చెక్కును కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి విజయరాజు, మెప్మా పిడి ఇమ్మానియేల్, లీడ్ డిస్టిక్ మేనేజరు నీలాధ్రి, సంఘ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.