జీజీహెచ్లో సైరిక్స్ హెల్త్ కేర్ బయో మెడికల్ వైద్య పరికరాలపై అవగహన..
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/20-7.jpg?fit=550%2C246&ssl=1)
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హాల్ లో సైరిక్స్ హెల్త్ కేర్ బయో మెడికల్ వైద్య పరికరాలపై క్రిటికల్ కేర్ ఎక్విప్‌మెంట్స్ పై యూజర్ ట్రైనింగ్ సేక్షన్ లో భాగంగా డీపీబ్లెటర్ మరియు బిపి, ఇసిజి, మానిటర్స్ లకు ఆసుపత్రిలో ఉండే నర్సింగ్ సిబ్బందికి బయో మెడికల్ ఎక్విప్మెంట్ పై పేషంట్స్ కు ఏ విధంగా కనెక్ట్ చేయాలి వారికి అవగాహన ఉండేందుకు సైరిక్స్ సిబ్బందితో అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగిందని అన్నారు.ఆసుపత్రిలోనీ పలు ఎమర్జెన్సీ విభాగాలలో ఉండే బయోమెడికల్ ఎక్విప్మెంట్ ప్రతిరోజు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలని నర్సింగ్ సిబ్బందికి ఆదేశించారు.ఆసుపత్రిలో ఉండే బయో మెడికల్ పరికరాల యొక్క రికార్డ్స్ ను ప్రాపర్గా మైంటైన్ చేయాలని నర్సింగ్ సిబ్బందికి ఆదేశించారు.ఈ కార్యక్రమానికి సిఎస్ఆర్ఎంఓ, డా.వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటర్, సింధు సుబ్రమణ్యం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, నర్సింగ్ సూపరింటెండెంట్, సావిత్రి బాయి, బయో మెడికల్ ఇంజనీర్, ఉమేష్, సైరిక్స్ హెల్త్ కేర్ సిబ్బంది విజయ్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/201-1.jpg?resize=550%2C246&ssl=1)