విపత్తుల సమయంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో అవగాహన
1 min read
సోషల్ మీడియా లో వచ్చిన వదంతులు నమోద్దు
మంత్రాలయం , న్యూస్ నేడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు విపత్తుల సమయంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో అవగాహన కల్పించడం జరిగిందని తహసీల్దార్ రవి, సిఐ రామాంజులు, కోసిగి సిఐ మంజునాథ్, ఎమ్మిగనూరు ఫైర్ సిఐ రామాంజనేయులు తెలిపారు. బుధవారం మంత్రాలయం లో తహసీల్దార్ కార్యాలయం నుండి రాఘవేంద్ర స్వామి మఠం వరకు మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వం, హోం శాఖల ఆదేశాల మేరకు మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించామని, ప్రజలు అనుకోని విపత్తులు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో ప్రజల అవగాహన కొరకు వివిధ సంబంధిత శాఖల అధికారులు కలిసి మాక్ డ్రిల్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అనుకోని విపత్తుల సమయంలో ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నారు. సైరన్ మోగినప్పుడు ప్రజలు తమ ఇళ్ల లో లైట్ లు ఆఫ్ చేసి ప్రమాదకర వస్తువులను దూరంగా ఉంచాలని సూచించారు. సోషల్ మీడియా లో వచ్చిన వదంతులు నమోద్దని వారు తెలిపారు. అనుమానితుల వ్యక్తులు కనిపిస్తే తమ సమాచారం ఇవ్వాలని సూచించారు. మాక్ డ్రిల్ కోసం దుకాణాలను అరగంట మూసివేశారు. మాక్ డ్రిల్ ను ఆసక్తి గా చూశారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం ఎస్సై శివాంజులు, మాధవరం ఎస్సై విజయ కుమార్, రెవెన్యూ, పోలీసు, ఫైర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
