PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్షేత్రస్థాయిలో పంట పరిశీలన పై అవగాహన

1 min read

– మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి..
పల్లెవెలుగు, వెబ్ గడివేమల: వ్యవసాయ శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గడివేముల మండలంలోని 5809 మంది రైతులకు 19790 ఎకరాలలో ఖరీఫ్ 2022లో సాగు చేసినటువంటి వివిధ పంటల పైన పంట నమోదు కార్యక్రమము , క్షేత్ర పరిశీలన మరియు రైతుల యొక్క వేలిముద్రలు సామాజిక తనిఖీ వివరాలను సంబంధిత ఆర్బికేలలో ప్రదర్శించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి ఏం సుందర్ రెడ్డి బుధవారం నాడు తెలిపారు నవంబర్ 2 ,3 ,4 వ తేదీలలో అన్ని గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో గ్రామసభలు నిర్వహించి ఆర్ బి కే నందు నమోదైన పంట మరియు విస్తీర్ణం వివరములను రైతులకు అందరికీ తెలియజేయడం జరుగుతుందన్నారు ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్టయితే రైతు సోదరులు సంబంధిత ఆర్బికే సిబ్బందికి ఫిర్యాదు చేయవలసిందిగా మండల వ్యవసాయ అధికారి సూచించారు.

About Author