చిన్నారుల ఎదుగుదల.. అభివృద్ధిపై అవగాహన
1 min read
సూపర్ వైజర్లు వరలక్ష్మి, రేణుకా దేవి ఆధ్వర్యంలో అవగాహన..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : చిన్నారుల అభివృద్ధి వారి ఎదుగుదల అభివృద్దే ముఖ్య ఉద్దేశమని మిడుతూరు అంగన్ వాడీ సూపర్వైజర్లు వరలక్ష్మి, రేణుకాదేవి అన్నారు. గురువారం 20 నుండి 22 వ తేదీ వరకు నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని ఉర్దూ పాఠశాలలో సూపర్ వైజర్లు వరలక్ష్మి,రేణుకా దేవి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘పోషన్ భీ – పడాయ్ భీ’అనే కార్యక్రమంపై పై ఉ.9 నుంచి సా 5 గంటల వరకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా 0-3 సంవత్సరముల పిల్లల అభివృద్ధి వారి ఎదుగుదల మరియు 0-6 సం.ల చిన్నారుల విద్యను ఆట పాటల ద్వారా బోధించడం పోషణ పెరుగుదల పర్యవేక్షణ గురించి సూపర్వైజర్లు అవగాహన కల్పించారు.ప్రీ స్కూల్ నందు పిల్లల్లో అభివృద్ధి మరియు తల్లి బిడ్డల పోషణ మరియు ఆరోగ్యం గురించి గ్రామల్లో కుటుంబాల్లో అవగాహన కలిగించి తల్లి బిడ్డల సంక్షేమంపై తీసుకోవలసిన జాగ్రత్తల నవచేతన్ లో భాగంగా పుట్టినప్పటి నుండి 3సo వరకు ఆధార్ శీలలో 3నుండి 6సo పిల్లలో పెరుగుదల పర్యవేక్షణలో వయస్సుకు తగ్గ బరువు,ఎత్తు ఉండాలి అప్పుడే చిన్నారులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారని అనారోగ్యంగా ఉన్న పిల్లల్ని పునర్వాస కేంద్రాలకు పంపించడం గురించి వివరించారు. కుటుంబానికి,సమాజానికి మంచి ఆరోగ్య వంతమైన బిడ్డలను అందచేయాలని తల్లులకు కూడా మీరు అవగాహన కల్గించాలని అన్నారు.కార్యకర్తలు గ్రూపులుగా ఏర్పడి పిల్లల అభివృద్ధి గురించి గ్రూపుల వారీగా వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.