ఎయిమ్స్ లో చేరిన అండర్ వరల్డ్ డాన్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ఆస్పత్రిలో చేరారు. తీహాడ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అండర్ వరల్డ్ డాన్ ను అధికారులు ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కడుపు నొప్పితో బాధపడుతున్న చోటా రాజన్ ను ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చినట్టు జైలు అధికారులు తెలిపారు. డిశ్చార్జీకి సంబంధించి ఇంత వరకు అధికారిక సమాచారం లేదు. 61 ఏళ్ల చోటా రాజన్ కరోన సోకడంతో ఏప్రిల్ లో ఆస్పత్రిలో చేరారు. కరోన నుంచి కోలుకున్నాక తిహాడ్ జైలుకు తరలించారు.