అండర్ వరల్డ్ డాన్ దావూద్ కూ మంత్రి పదవి ఇస్తారు !
1 min read
పల్లెవెలుగువెబ్ : బీజేపీ నకిలీ హిందుత్వ రాజకీయాలు చేస్తోందని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే మండిపడ్డారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బీజేపీలో చేరితే ఏకంగా మంత్రి పదవి కూడా ఇస్తారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర నుంచి ముంబై నగరాన్ని వేరు చేసేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలు సాగవని హెచ్చరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీతో తమ కూటమి విచ్ఛిన్నమయ్యాక గాడిదలను తన్ని తరిమేశామని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.