జాబ్ క్యాలెండర్ పై భగ్గుమన్న నిరుద్యోగులు
1 min readపల్లెవెలుగు వెబ్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్ ఒట్టి బూటకమని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విజయనగరం, విశాఖపట్నంలో భారీ ఎత్తున నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. విజయనగరంలో కలెక్టరేట్ ముట్టడి చేశారు. ఆ తర్వాత విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ కేలండర్ నిరుద్యోగులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ నిర్వహించాలంటూ ఆందోళన చేశారు. విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులో విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఉద్యోగాలతో కూడిన జాబ్ క్యాలెండర్ విడదుల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.