మండల పరిషత్ పాఠశాల అకస్మిక తనిఖీ..
1 min read– ఎంపీడీవో రాజ్ మనోజ్..
– ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుయ్యే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలి..వసతులు, భోజన సదుపాయం, క్రీడా పరంగాణం పై ప్రత్యేక దృష్టితో పరిశీలన..
– 24 గంటల్లో 13 పాఠశాలలో సందర్శన..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : పెదవేగి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో వసతులు పై తనిఖీ చేసి ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే విధంగా పెంపొందించాలని పెదవేగి మండల పరిషత్ అభివృద్ధి అధికారి జీ.ఆర్. రాజ్ మనోజ్ ఉపాధ్యాయులకు సూచించారు. సంతృప్తి వ్యక్తం చేస్తూనే అక్కడక్కడ కొన్నిచోట్ల సూచనలను సలహాలను ఉపాధ్యాయులకు సిబ్బందికి అందించారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని పలు మండల పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడమైనది. పిల్లలతో వారు ఏం నేర్చుకుంటున్నారు అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం నాణ్యత బాగుందా లేదా అనే విషయాన్ని కూడా విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది.నిన్న ఈరోజు 13 పాఠశాలలను సందర్శించడం జరిగింది. వోన్గూరు, కవగుంట గార్లమడుగు ,నడిపెల్లి విజయరాయి, కె కన్నాపురం, కొప్పాక గూడెం తదితర స్కూల్ న్ను సందర్శించి అక్కడ పరిస్థితులను ప్రత్యేక దృష్టితో పరిశీలించడం జరిగింది. క్రీడా ప్రదేశాలను, మరుగుదొడ్లను పరిసరాలను కూడా పరిశీలించడం జరిగింది. మంచినీటి సరఫరా, క్లాస్ రూమ్ పరిస్థితి అలాగే క్లాస్ రూములో వసతులు మధ్యాహ్న భోజనం తయారు చేసే వంటగది తదితరాలను పరిశీలించడం జరిగింది. జానంపేట పాఠశాల, వంగూరు మరియు కన్నాపురం పాఠశాలలో పిల్లలు అతి తక్కువ మంది ఉదటం వారి విద్యా ప్రమాణలు కూడా చాలా తక్కువ ఉండటం గమనించడం జరిగింది. అదేవిధంగా సీతాపురంలో పిల్లలు లేని స్థితిని కూడా గమనించడం జరిగింది. ఈ వివరాలన్నిటిని జిల్లా కలెక్టర్ కి నివేదించడం జరిగిందన్నరు.