పంచారామక్షేత్ర సందర్శనకు అనూహ్యస్పందన
1 min read– ఆర్టిసి జోనల్ ఇడి గిడుగు వెంకటేశ్వరరావు
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : జిల్లా వ్యాప్తంగా 80 వేల మంది ప్రయాణికులు క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నామని ఆర్టీసీ విజయవాడ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు తెలిపా రు ఆయన బుధవారం ఏలూరు ఆర్టీసీ డిపోను సందర్శించి పలు జాగ్రత్తలను అధికారులకు సూచించారు అనంతరం విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2022 23 సంవత్సరానికి గాను 21,220 ఉచిత బస్సు పాసులను విద్యార్థిని విద్యార్థులకు జారీ చేశినట్లు తెలిపారు అలాగే ఏలూరు జిల్లా నుండి శబరిమలైకి ఆరు బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసామన్నారు కార్తీకమాసం సందర్భంగా భక్తులకు పంచారామ క్షేత్రాలకు 21 బస్సులను నడపడం జరిగిందని ఇ మిగిలిన రెండు వారాలలో భక్తులు దర్శనానికి ఆర్టీ బస్సులో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు విద్యార్థుల సౌకర్యార్థం నూజివీడు నుండి రమణక్కపేట మీదుగా ధర్మాజీగూడెం వరకు బస్సును పునరుద్ధరించినట్లు చెప్పారు ప్రయాణికుల కోరిక మేరకు అశ్వరావుపేట నుండి జంగారెడ్డిగూడెం మీదగా పోలవరం బస్సు ప్రారంభించడం జరిగిందని అలాగే విద్యార్థులు మహిళలు ఉద్యోగులు సౌకర్యం కోసం ఏలూరు పాత బస్టాండ్ నుండి వట్లూరు వరకు బస్సును నడుపుతున్నట్టు చెప్పారు అదేవిధంగా ఏలూరు జిల్లాకు 13 కొత్త హెయిర్ బస్సులను కేటాయించడం జరిగిందని ఇప్పటికే ప్రస్తుతం ఆరు బస్సులు నడుస్తున్నట్లు తెలిపారు మరో వారం రోజుల్లో మిగిలిన బస్సులను కూడా నడుపుతామని ఆయన తెలియజేశారు ఇంకా ఔత్సాహిక వ్యాపారస్తులకు ఏలూరు బస్టాండ్ నందు ఉన్న ఖాళీ స్థలం డిఓటి పద్ధతిపై ఇవ్వడం జరుగుతుందని ఆసక్తి కలవారు టెండర్లలోపాల్గొనవచ్చు అని ఆయన వివరించారు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టిసి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ప్రయాణికుల సేవ కోసం తమ శాఖ అధికారులు చేయూత అందిస్తారని ఆయన పేర్కొన్నారు రవాణా వ్యవస్థలో అవకతవకలు ఉంటే సహించేది లేదని అలాగే ప్రయాణికులకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తే తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రయాణికులు ఎవరైనా ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చునని వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సమావేశంలో డిపిటిఓ ఏ వీరయ్య చౌదరి ఏలూరు డిపో మేనేజర్ శ్రీమతి బి వాణి ఏటీఎం కార్గో గిరిధర్ కుమార్ ఏవో వెంకటేశ్వరరావు ఆర్ఎం ఆఫీస్ సూపరింటెండెంట్ వేణుగోపాలరావు నరసింహం పాల్గొన్నారు.