NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధ్యాయ వృత్తిలో ప్రధానోపాధ్యాయురాలి సేవలు మరువలేనివి

1 min read

పల్లెవెలుగు వెబ్  పత్తికొండ: పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించి పదవి విరమణ పొందిన వెంకమ్మ మేడం గారి సేవలు మరువలేనివని పాఠశాల ఉపాధ్యాయ బృందం గుర్తు చేశారు. బుధవారం పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయురాలు వెంకన్న మేడం పదవి విరమణ  వీడ్కోలు సభ నిర్వహించారు.ఈ సభకు సీనియర్ ఉపాధ్యాయిని బ్రమరాంభ అధ్యక్షత వహించారు.స్కూల్ ఉపాధ్యాయ బృందం పూల దండలతో,శాలువాలతో వెంకమ్మ మేడం ను ఘనంగా సన్మానించారు.బంధువులు ,మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఆమెను పూలమాలలు, సాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా  వక్తలు రసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నత మైనదని, పవిత్రమైనదని ఎందరినో విద్యార్థిని, విద్యార్థులను తీర్చి దిద్దిన ఘనత ఆమెకు దక్కిందని అన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆమె చేసిన సేవలు మరువ లేనివని ఉపాధ్యాయ బృందం గుర్తు చేశారు.కార్యక్రమం అనంతరం సతీసమేతంగా రామలింగడు,వెంకమ్మ గార్లనీ మేల తాళాలతో వారిని ఘనంగా ఇంటి వరకు సాగనంపారు.ఈకార్యక్రమంలోమండల విద్యాదికారులుమస్తాన్వలి,రంగస్వామి,రమేష్, వేణుగోపాల్, ప్రిన్సిపల్  వీరేశప్ప,ప్రధానోపాధ్యా యులు మాలతి,సరోజ ,ప్రసాద్ బాబు,సత్య నారాయణ, ఉపాధ్యాయుని ఉపాద్యాయులు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.

About Author