పాపం పసి పులి కూనలు దారితప్పాయి
1 min read– తల్లి చెంతకు చేర్చేందుకు రంగంలోకి రెస్క్యూ టీం
– రెండు పులి కునాల ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన
– పులి కూనలకు పాలు తాగించేందుకు ఫారెస్ట్ అధికారుల ప్రయత్నం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పాపం వారం రోజుల క్రిందట కళ్లు తెరిచిన పులి పిల్లలు దరితప్పాయి.. తల్లి నుంచి విడివడిన కూనలు ఊళ్లోకి వచ్చేశాయి. ఓ రైతు వాటిని భద్రంగా ఒక్కొక్క పులి కూనను ఒక్కొక్క గంప కింద దాచి ఉంచి అధికారులకు కబురు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం గుమ్మడాపురం గ్రామంలోకి ఈ ఉదయం నాలుగు పులి పిల్లలు వచ్చాయి. ఈ ఊరు అడవిని ఆనుకుని ఉంటుంది. కొలనుభారతి క్షేత్రానికి దగ్గరలో సంగమేశ్వరం దారిలో ఈ గ్రామం ఉంది. గ్రామానికి చెందిన ఒక రైతు ఉదయం తన కళ్ళానికి వెళ్లి వస్తుంటే పులి కూనలు ఆయన వెంట ఊర్లోకి వచ్చాయి. వాటిని గమనించిన ఆయన, కుక్కలు వాటికి ప్రమాదం కలిగించే అవకాశం ఉందని భావించి వాటిని ఓ ఇంట్లో భద్రపరిచి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు.పులి కూనలు కాస్త నీరసంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి రెస్క్యూ టీం..
రెస్క్యూ టీం రంగంలోకి దిగి పులి కూనలను తల్లి వద్దకు చేర్చే ప్రయత్నం చేశారు. సాయంత్రానికి కూడా తల్లి పిల్లల వద్దకు రాకపోవడంతో పులి కూనలు డస్సి పోయాయి. దీనితో అధికారులు వాటిని బైర్లుటికి తరలించి వాటిని ఏసీలో ఉంచి ఆహారం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక వాటి సంరక్షణ తిరుపతి వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు అప్పగించాలని నిర్ణయించి నట్లు సమాచారం.
పులి కూనలపై కొనసాగుతున్న ఉత్కంఠ…
ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం గ్రామంలో పెద్ద పులి కూనల లభ్యమైన ఘటనలో ఉత్కంఠ కొనసాగుతోంది.అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన నాలుగు పులి కూనల్లో రెండు పులి కూనల ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెస్క్యూ టీమ్ సిబ్బంది పులికూనలను ఆడవిలో వదిలిన కానీ, అక్కడి నుంచి అవి కదలడం లేదు.పులి కూనలకు పాలు తాగించేందుకు ప్రయత్నంపులికూనలకు పాలు తాగించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నం చేసింది. నాలుగు పులి కూనలను తిరుపతి జూకు తరలించే యోచనలో అటవీ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా పులి కూనలు డీహైడ్రేషన్‌కు గురికావడంతో బైర్లుటి వైల్డ్ లైఫ్ ఆసుపత్రికి అధికారులు తరలించారు. పులి కూనల తల్లీ(పెద్దపులి) ఆచూకీ తెలుసుకునేందుకు ఇన్‌ఫ్రారెడ్(ట్రాప్) కెమెరాలను టైగర్ ట్రాకర్లు పరిశీలిస్తున్నారు.