యూనిఫాం సివిల్ కోడ్.. ఎంఐఎం వ్యతిరేకం !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు తమ ఆల్ ఇండియా ఏఐఎంఐఎం పార్టీ వ్యతిరేకమని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జైపూర్‌లో రాజస్థాన్ పార్టీ యూనిట్‌ను ప్రారంభించారు.‘‘భారతదేశం భిన్నత్వానికి ప్రసిద్ధి. ఆ వైవిధ్యాన్ని మనం నిలుపుకోవాలి. ఏఐఎంఐఎం యూనిఫాం సివిల్ కోడ్ విధింపునకు అనుకూలం కాదు. గోవా వంటి అనేక చోట్ల హిందువుల కోసం నిబంధనలు రూపొందించారు… బీజేపీ యూనిఫాం సివిల్ కోడ్ అమలు కోసం ఆ నిబంధనలను తొలగించడానికి సిద్ధంగా ఉన్నారా?’’ అని ఒవైసీ ప్రశ్నించారు.