NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డవ్ షాంపూ పై యూనిలివర్ కంపెనీ స్పందన

1 min read

పల్లెవెలుగువెబ్ : యూనిలీవర్ భారత అనుబంధ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ అప్రమత్తమైంది. డవ్, ట్రెసెమే తదితర డ్రై షాంపూలను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. దీనిపై యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తన వెబ్ సైట్ లో నోటిఫై చేసింది. దీంతో భారత్ లో ఈ ఉత్పత్తులను వినియోగిస్తున్న వారిలో ఆందోళన నెలకొంది. దీన్ని తొలగించే ప్రయత్నం చేసింది హిందుస్థాన్ యూనిలీవర్. బెంజీన్ అనే కెమికల్ ప్రమాదకర స్థాయిలో ఉండడంతో డ్రై షాంపూలను ఉపసంహరించుకుంటున్నట్టు యూనిలీవర్ వివరణగా ఉంది. భారత్ లో తాము అసలు డ్రై షాంపూలను తయారు చేయడం లేదని హిందుస్థాన్ యూనిలీవర్ ప్రకటన విడుదల చేసింది. ‘‘యూనిలీవర్ యూఎస్, కెనడాలో 2021 అక్టోబర్ ముందు తయారు చేసిన డ్రై షాంపూలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. పరీక్షల్లో వీటిల్లో బెంజీన్ స్థాయులు పెరిగిపోయినట్టు తేలింది. దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని స్వతంత్ర సర్వేలో వెల్లడైంది’’అని హిందుస్థాన్ యూనిలీవర్ ప్రకటించింది.

About Author