PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యూనియన్​ బ్యాంకు.. రూ.5లక్షలు ఆర్థిక సాయం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కడప: కడప జిల్లా అభివృద్ధికి యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా తమవంతు సాయంగా రూ. 5లక్షలు అందజేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (DCC), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (DLRC) బ్యాంకర్స్ సమావేశం జరిగింది. అనంతరం జిల్లా సహాయ నిధికి యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా 5 లక్షల చెక్కును కలెక్టర్​ సి. హరికిరణ్​కు అందజేశారు. జిల్లా పురోగతికి, పథకాల అమలుకు, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో యూనియ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా కీలకపాత్ర పోషించడం అభినందనీయమని ఈ సందర్భంగా కలెక్టర్​ హరికిరణ్​ ప్రశంసించారు.

About Author