PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్రమంత్రి అజయ్ మిశ్రాని తక్షణమే పదవి నుంచి తొలగించాలి..

1 min read

– లఖింపూర్ ఘటనలో న్యాయం చేయాలని దేశ వ్యాప్తంగా రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న లఖింపూర్ ఖేరి లో 2021 అక్టోబర్ 3 లఖింపూర్  రైతుల హత్యా ఖండలో ప్రధాన కుట్ర దారైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తెనీనీ  తక్షణమే పదవి నుంచి తొలగించి, ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తూ కిసాన్ సంఘర్స్ కోఆర్డినేషన్ కమిటీ దేశవ్యాప్త పిలుపుమేరకు దేవనకొండలో మంగళవారం నాడు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం దగ్గర మహాత్మా గాంధీ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీల  తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు యూసుఫ్ భాష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్, సిఐటియు సీనియర్ నాయకులు నాగేష్, మండల కార్యదర్శి అశోక్, రైతు సంఘం మండల కార్యదర్శి సూరి లు  మాట్లాడుతూూ, లఖింపూర్ ఖైరీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్న వారిపై దుర్మార్గంగా కారుపోనిచ్చి ఆ దాడిలో మరణించిన నలుగురు రైతుల మృతి వెనక మంత్రి ఆయన యొక్క కుమారుడు అశీష్ మిశ్రా పాత్ర ఉందని  తేలిందన్నారు.వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ జరిగిన ఐక్య రైతు ఆందోళనలను అణిచివేయడానికి బిజెపి పన్నిన కుట్ర అని  విమర్శించారు. గత రెండేళ్లలో ప్రధాని మోడీ అజయ్ మిశ్రా ను డిస్మిస్ చేయడం కానీ, రాజీనామా చేయాలని కోరడం గాని జరగలేదనిితెలిపారు.  ఎఫ్ ఐ ఆర్ లో మంత్రి పేరు ఉన్నప్పటికీ ప్రధాని ఆయనను రక్షిస్తున్నారని వారు విమర్శించాయి. సుప్రీంకోర్టు జోక్యం తర్వాతనే యూపీ ప్రభుత్వం ఆశిష్ మిశ్రా ఇతర నిందితులను అదుపులోకి తీసుకుందని అన్నారు. వారితోపాటు అమాయకులైన రైతులను కూడా అరెస్టు చేశారని వారు అన్నారు. ప్రజాస్వామ్య రీతిలో ఉద్యమాలు జరుపుతున్న వారిపై జరిగే అణచివేత దాడులకు నిరసనగా నేడు బ్లాక్ డే ను పాటిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం కార్పోరేట్ అనుకూల కార్మిక, కర్షక, రైతు పోరాటం సందర్భంగా రైతులపై పెట్టిన తప్పుడు కేసులు ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున కేంద్ర కార్మిక సంఘాలన్నిటిని ఒక తాటిపైకి తెచ్చి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన పద్ధతిలో రైతులకు గిట్టుబాటు ధర మార్కెట్ వ్యవస్థ పటిష్ట చేయాలని కోరారు. అలాగేే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం నేపథ్యంలో రైతులకుపంటరుణాలురద్దుచేయాలని వారు డిమాండ్చేశారు.ఈకార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రంగన్న, మహేంద్ర, రాము, రాముడు ,శ్రీనివాసులు, సుంకన్న ,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author