‘‘ఫాంహౌస్‌లు లేవు.. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చుచేయలే’’
1 min read
పల్లెవెలుగు వెబ్: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిచారు. యేటా ధాన్యం కొనుగోళ్లను కేంద్రమే చేపడుతోందన్నారు. ఇందు కోసం రూ.26,640 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అయితే ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ వక్రీకరించి మాట్లాడం సరికాదన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ పెరగపోయినా.. దేశంలో పెట్రో, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిందని కేసీఆర్ నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ పెరగపోతే.. ఇక్కడ పెంచాల్సిన అవసరం కేంద్రానికి ఏ మాత్రం లేదని కిషన్ స్పష్టంచేశారు. ప్రస్తుతం పరిస్థితులు గాడిన పడుతున్నాయని… అందుకే కేంద్రం ధరలను తగ్గిస్తూ వస్తోందని వివరించారు. తెలంగాణలోనూ పెట్రో, డీజిల్ ధరలను తగ్గించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సెస్‌లు పేరిట కేంద్రం దోచుకుంటుందని కేసీఆర్ అనడం సబబు కాదన్నారు. ఆ అవసం తమకు లేదన్నారు. బీజేపీ నేతలకు ఫాం హౌస్‌లు లేవని .. ఉప ఎన్నిక కోసం రూ. 350 కోట్లు ఖర్చు చేసింది తాము కాదన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తామన్న వారి తాటాకు చప్పుళ్లకు భయపడమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.