అసమాన అద్భుత దీప్తి.. అరుదైన అపూర్వకీర్తి: డాక్టర్ మల్లు వెంకటరెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్: భగవద్గీత సమస్త మానవులు తెలుసుకోవలసిన మానవ ధర్మ శాస్త్రమని వక్తలు ఉద్బోధించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు- శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యాలయం మరియు శ్రీమద్భగవద్గీత సేవా సమితి నంద్యాల వారి సంయుక్త నిర్వహణలో నంద్యాల పట్టణంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, శ్రీకృష్ణ మందిరం నందు “శ్రీమద్భగవద్గీత సంపూర్ణ శ్లోక పారాయణ యజ్ఞం” జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ ఇంటింటికీ భగవద్గీత.. ప్రతినోట భగవద్గీత లక్ష్యంతో తితిదే ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, ప్రపంచంలో మన దేశానికి ఒక విశిష్టమైన స్థానం సంపాదించుటకు గల కారణం భగవధ్గీత వల్లనే అని అన్నార. అనంతరం శ్రీ శారదా జ్ఞాన పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివయోగీంద్ర సరస్వతి మాట్లాడుతూ కర్తవ్య విముఖుడైన మానవుడిని కర్తవ్యోన్ముఖున్ని చేసేదే శ్రీమద్భగవద్గీత అని, భారత స్వాతంత్ర్య సంగ్రామంలో దేశంకోసం సర్వస్వం త్యాగం చేసిన అతివాదులు బాల్ లాల్ పాల్ ( బాలగంగాధర తిలక్,లాలా లజపతిరాయ్,బిపిన్ చంద్రపాల్)లకే కాకుండా, గాంధీజీవంటి మితవాదులకు కూడా భగవద్గీతనే స్పూర్తి అని అన్నారు.
ఈకార్యక్రమంలో లలితా పీఠం పీఠాధిపతి శ్రీ గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి, అఖిలభారత విష్ణుసహస్రనామ కల్చరల్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు మారం నాగరాజు గుప్తా, కర్నూలు గొలగపూడి పీఠాధిపతి స్వాత్మానంద స్వామి, భగవధ్గీత ప్రచారకులు యం.మద్దయ్య స్వామి , ఆర్యవైశ్య సంఘం శాశ్వత గౌరవాధ్యక్షులు శెట్టిశ్రీ ఆత్మకూరు విజయకుమార్, అధ్యక్షులు భవనాశి శ్రీనివాసులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి బైసాని రామశేషు, విష్ణు సహస్రనామ సంఘం కార్యదర్శి గుండా రోజా రమణి, అధ్యక్షులు సుశీల రాణి, ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షులు తాడువాయి ఇందుమతి, కార్యదర్శి కూరాకు శోభారాణి తదితరులు మాట్లాడారు. భక్తులందరికీ గీతాసేవాసమితి మహాప్రసాదం ఏర్పాటు చేసి అతిథులను వక్తలను ఘణంగా సత్కరించారు.